ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశాల్లో ఫిన్లాండ్(Finland) ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇందులో భారతదేశం 118వ స్థానాన్ని దక్కించుకుంది. మార్చి 20 అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా జాబితా విడుదలైంది. గతేడాది 126వ ర్యాంకులో ఉన్న భారత్ ఎనిమిది స్థానాలు ఎగబాకింది. కుటుంబమంతా కలిసి భోజనాలు చేసే వాతావరణం క్రమంగా తగ్గుతోందని, భారతీయులు వారానికి సగటున నాలుగు భోజనాలు మాత్రమే కలిసి చేస్తున్నారని స్పష్టమైంది. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి వల్లే కలివిడితనానికి దూరమవుతున్నారని తేలింది. దేశాల జనాభా(Population)ను బట్టి గత మూడు సంవత్సరాల సగటును లెక్కగట్టి నివేదిక రూపొందించారు. 10 పాయింట్లకు గాను ఫిన్లాండ్ 7.736 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్(23), అమెరికా(24) స్థానాల్లో నిలిచాయి.