అంతుపట్టని(Mysterious) జ్వరంలో 14 మంది మృత్యువాత పడ్డారు. అందులో ఆరుగురు చిన్నారులు(Children) కాగా, ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. కచ్ జిల్లాలోని లఖ్పత్, అబ్దాసా తాలూకాల పరిధిలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 50 మెడికల్ టీముల్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 3, 10 తేదీల్లో 48 కేసుల్ని గుర్తించినట్లు గుజరాత్ వైద్యారోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు.
50 టీమ్స్ లో నిపుణులైన కార్డియాలజిస్ట్, ఫిజిషియన్లను నియమించి ఐసోలేషన్ బెడ్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచారు. కొవిడ్ ను తలపిస్తున్న ఈ అంతుచిక్కని జ్వరం మిస్టరీగా మారింది. కారణాల్ని గుర్తించేందుకు బాధితుల నమూనాల్ని పుణె వైరాలజీ సెంటర్ తోపాటు గాంధీనగర్లోని గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్(GBRC)కు పంపించారు. ఈ మధ్యకాలంలో కచ్ జిల్లాలో భారీగా వర్షాలు పడ్డాయి. దీనివల్లే వ్యాధి సోకిందా అన్నది తేలాల్సి ఉంది.