
ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లలేని అభాగ్యులు వారు. కిడ్నీలో రాళ్లు, న్యూమోనియా, పక్షవాతం వంటి కారణాలతో సర్కారు వైద్యాన్ని నమ్ముకున్నారు. ఏదో ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుందని గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళితే ఏకంగా ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. అలా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన 24 గంటల్లోనే 18 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు.. ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఘటన మహారాష్ట్ర థానేలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగింది. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఘటనపై CM ఏక్ నాథ్ షిండే ఎంక్వయిరీకి ఆదేశించారు. స్వతంత్ర కమిటీ దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుందని సర్కారు తెలిపింది. ఒక్క రోజులోనే ఇంతమంది చనిపోవడంపై రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని హెల్త్ డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది.