
Published 29 Jan 2024
ప్రతిరోజూ మీ అల్పాహారంలో గుమ్మడికాయ గింజలను ఎందుకు తీసుకోవాలంటే?
Pumpkin Seeds Health Benefits : గుమ్మడికాయ.. అత్యంత పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం. గుమ్మడి గింజలను ప్రతిరోజూ అల్పాహారంతో సహా ఏదైనా భోజనంలో చేర్చవచ్చు. మీ ఉదయపు దినచర్యలో గుమ్మడికాయ గింజలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే, ప్రతిరోజూ ఏదైనా బ్రేక్ ఫాస్ట్ తీసుకునే సమయంలో ఒక టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజల(Pumpkin Seeds)ను తీసుకోవడం ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉన్నందున వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని గుర్తుంచుకోండి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుందాం..
ప్రతిరోజూ మీ అల్పాహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చుకోవడానికి గల 7 కారణాలివే :
పోషకాలు అధికంగా ఉంటాయి :
గుమ్మడికాయ గింజలు మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’, విటమిన్ ‘ఇ’, బీటా కెరోటిన్, పొటాషియం, ఫైబర్ అధిక మోతాదులో కలిగి ఉంటాయి. కంటి దృష్టికి విటమిన్ ‘ఎ’ సాయపడుతుంది. విటమిన్ ‘సి’ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్ ‘ఇ’ అనేది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. బీటా-కెరోటిన్ ఆరోగ్యకరమైన చర్మానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది :
గుమ్మడికాయ గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైటోస్టెరాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీ గుండెను వ్యాధుల నుంచి రక్షించడంలో సాయపడతాయి. రక్తపోటును కూడా తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జీర్ణక్రియకు తోడ్పడుతుంది :
మంచి ఫైబర్ కలిగిన గుమ్మడి గింజలు జీర్ణక్రియను ప్రోత్సహించే ముఖ్యమైన పోషకాలుగా చెప్పవచ్చు. గుమ్మడికాయలో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండింటికి అద్భుతమైన మూలం. మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా బాగా పనిచేయడంలో సాయపడుతుంది. అంతేకాదు.. పేగు కదలికలను నియంత్రించడంలో సాయపడుతుంది. మలబద్ధకం, ఇతర జీర్ణ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మంచి నిద్ర :
గుమ్మడికాయ గింజలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్‌గా మారుతుంది. ఈ రెండు న్యూరోట్రాన్స్మిటర్లు శరీరానికి విశ్రాంతిని, మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. పడుకునే ముందు గుమ్మడికాయ గింజలు తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
బరువును తగ్గిస్తుంది :
గుమ్మడికాయ గింజలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉంటాయి. బరువు తగ్గడానికి సరైన ఆహారంగా చెప్పవచ్చు. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సాయపడతాయి. తద్వారా మితిమీరిన ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది :
గుమ్మడికాయలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ అల్పాహారంలో గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల మీ శరీరానికి ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి అవసరమైన పోషకాలను అందుతాయి. తద్వారా అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.
ఎనర్జీ లెవల్స్ ను పెంచుతాయి :
గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్లు, హెల్తీ ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్‌ని పెంచడానికి సరైన ఆహారంగా చెప్పవచ్చు. ప్రతిరోజూ ఉదయం పూట కొన్ని గుమ్మడిగింజలను తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.