కుక్క కరిస్తే రేబిస్ ఇంజక్షన్ ఇస్తారు. కానీ కుక్క కాటు లేకున్నా రేబిస్ ఇంజక్షన్ ఇస్తే.. ఏం జరగుతుంది.. దీనిపైనే కేరళ(Kerala) సర్కారు విచారణ నిర్వహిస్తోంది. జ్వరంతో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారికి రేబిస్ ఇంజక్షన్ ఇచ్చిన ఓ నర్సును ప్రభుత్వం(Government) సస్పెండ్ చేసింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఫీవర్ తో ఉన్న పాపను ల్యాబ్ దగ్గర కూర్చోబెట్టి తల్లిదండ్రులు బిల్లు కట్టేందుకు వెళ్లారు. ఆ టైమ్ లో రేబిస్ కోసమే వెయిట్ చేస్తున్నట్లు భావించిన నర్సు.. చిన్నారికి ఇంజక్షన్ వేసింది. పొరపాటున జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్ మెంట్ ఎంక్వయిరీకి ఆదేశించింది.
అయితే రేబిస్ ఇంజక్షన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, పాప ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. కుక్క కాటు లేకున్నా రేబిస్ ఇంజక్షన్ వేయడం వల్ల ప్రమాదం లేదని దీని ద్వారా రుజువైంది.