Top 5 Home Remedies : చలికాలంలో దోమల బెడద ప్రతి ఒక్కరిని బాధిస్తుంటుంది. వాతావరణంలో మంచు వంటి తేమతో కూడిన ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందుతాయి. చాలా వరకు దోమకాటు ప్రమాదకరం కాకున్నా కొన్ని వ్యాధులకు కారణమవుతాయి. ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమించడం సాధారణం(Common)గా మారిపోయింది. దోమ కాటు వల్ల అది కుట్టిన చోట ఎర్రటి గడ్డలు, దురద వస్తాయి. అది కొన్నిసార్లు చాలా బాధిస్తుంది. నెట్ లేదా దోమల రిపిల్లర్లు వంటివి దోమల కాటును నివారించడానికి ఉపయోగించవచ్చు. దోమ కాటును నివారించడానికి మీరు కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
దోమ కాటుకు ఎఫెక్టివ్ హోం రెమెడీస్ :
1. ఐస్ క్యూబ్స్ :
ఐస్ ముక్కలు(Ice Cubes) శరీరంపై దోమకాటుతో కలిగే మంటను తగ్గించడంలో సాయపడతాయి. తిమ్మిరిని తగ్గిస్తుంది. కొంతకాలం చికాకును తగ్గిస్తుంది. ఒక గుడ్డలో కొంచెం ఐస్ ముక్కలను చుట్టి, ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయవచ్చు. చర్మం దెబ్బతినకుండా ఉండటానికి ఐస్ ముక్కలను ఎక్కువసేపు ఉంచవద్దు.
2. కలబంద :
మీ చర్మానికి కలబంద అద్భుతాలు చేస్తుంది. దోమ కాటు వల్ల కలిగే అసౌకర్యంతో పోరాడటానికి కూడా సాయపడుతుంది. అలోవెరా జెల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మీరు తాజా అలోవెరా(Aloe vera) జెల్(Gel)ను తీసి దోమకాటు ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయవచ్చు. తొందరగా ఉపశమనం పొందవచ్చు.
3. తేనె :
తేనె(Honey)లో మీ చర్మానికి మేలు చేసే గుణాలు కూడా ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. మీరు ప్రభావిత ప్రాంతంలో కొన్ని చుక్కల తేనెను వేయవచ్చు. మంటను తగ్గించడం ద్వారా మీకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది.
4. తులసి :
తులసి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇందులో దోమ కాటుకు ఉపశమనం కలిగించే సమ్మేళనం కూడా ఉంది. దోమ కాటుకు తులసిని ఉపయోగించడానికి మీరు కొన్ని తాజా తులసి ఆకులను తీసుకోవాలి. వీటిని ఒక కప్పు నీటిలో వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఈ నీటిని చల్లబరచాలి. ఆ తరువాత కాటన్ సాయంతో మీ చర్మంపై రుద్దండి.
5. ఉల్లిపాయ :
ప్రతి భారతీయ వంటగదిలో ఉల్లిపాయ ఉంటుంది. అనేక ఆహార పదార్థాల తయారీలో వీటిని వినియోగిస్తారు. దోమ కాటుపై కూడా ఉల్లిపాయను ఉపయోగించవచ్చు. మీరు తాజా ఉల్లిపాయ ముక్కను తీసుకొని నేరుగా అప్లై చేసుకోవచ్చు. కొంత సమయం తర్వాత ఆ ప్రాంతాన్ని నీటితో కడగాలి.
పైన పేర్కొన్న విధంగా దోమ కాటుకు అద్భుతంగా పనిచేసే ఇంటి చిట్కాలను పాటించవచ్చు. తద్వారా దోమకాటు ప్రభావం నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అయితే, ఈ చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే.. తీవ్రమైన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స(Treatment) తీసుకోవడం మరిచిపోవద్దు.
Published 05 Feb 2024