రాత్రి పూట త్వరగా నిద్రపోయే వారి కన్నా ఆలస్యంగా నిద్రించే వారికి అనారోగ్యం ముప్పు పొంచి ఉంది. నిద్రపోకుండా ఎక్కువ సేపు ఉంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. దీన్ని నిజం చేసేలా ఫిన్లాండ్ పరిశోధకులు సరికొత్త నివేదికను వెల్లడించారు. రోజులో 8 గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోతే మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చారు.
త్వరగా నిద్రపోయే వ్యక్తులు, తొందరగా నిద్ర రానివారిని పరిశీలించిన పరిశోధకులు.. విడివిడిగా సర్వే నిర్వహించారు. సమయానికి నిద్ర పోతున్నారా అనే దాని కన్నా స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లే అతి పెద్ద ప్రమాదమని తేల్చారు. త్వరగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని తేల్చారు.