
చలికాలంలో చర్మం మృదువుగా ఉండటానికి రకరకాల ఫేస్ క్రీములు, సీరమ్స్, ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్‌ను అతిగా వాడుతుంటారు. వీటివల్ల చర్మంపై ఉండే సహజసిద్ధమైన రక్షణ పొర దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారంగా ‘స్కిన్ ఫాస్టింగ్’ పద్ధతిని పాటించాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. చర్మ సంరక్షణ ఉత్పత్తులకు కొద్దిరోజుల విరామమిచ్చి, చర్మం తనంతట తానే కోలుకునేలా చేయడాన్ని స్కిన్ ఫాస్టింగ్ అంటారు. దీన్ని కొన్నాళ్లు పాటిస్తే ముఖం కాంతివంతంగా, సహజసిద్ధంగా మారి అందంగా తయారుకావచ్చని చెబుతున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో వైద్యుల సలహాలు తీసుకున్నాకే స్కిన్ క్రీములు వాడాల్సి ఉంటుంది.