
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకే పెట్రోల్ అమ్మాలని ఢిల్లీ సర్కారు ఆదేశించింది. బీఎస్-4 ఇంజిన్లు లేని వెహికిల్స్ ను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. ఈ చర్య వల్ల గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుంచి హస్తినలోకి రోజూ 12 లక్షల వాహనాల్ని రాకుండా అడ్డుకోవచ్చు. 126 చెక్ పోస్టుల్లో 2,580 పోలీసులు, పెట్రోల్ బంకుల్లో రవాణా, మున్సిపల్ సిబ్బందిని మోహరించింది. బంకుల వద్ద ఇప్పటికే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ల గుర్తింపు కెమెరాల్ని అమర్చి క్షుణ్నంగా నిఘా పెట్టింది. వాయు కాలుష్యం దారుణంగా మారి కొద్ది రోజుల క్రితం AQI 470కి చేరింది. నిన్న సాయంత్రం 334 నుంచి 354గా నమోదైంది. ఇక లంగ్ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.