
ప్రజల శరీరాల్లో ప్లాస్టిక్ పేరుకుపోయి గుండె జబ్బులు, ఉబ్బసం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తోందని తేలింది. 2040 నాటికి కోల్పోయే ప్రాణాలకు లెక్కే ఉండదని ‘ది ఫ్యూ ఛారిటబుల్ ట్రస్ట్’ సర్వేలో తేలింది. వచ్చే 15 ఏళ్లలో ప్లాస్టిక్ కాలుష్యం 130 మిలియన్ల నుంచి 280 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరి 75% రోగాలు వస్తాయి. పాలిమర్ ను కాల్చడంతో 58% ఉద్గారాలు పెరిగి మొత్తం కాలుష్యంలో 79% ప్లాస్టిక్ ఉంటుంది. తేరుకోకుండా ఐదేళ్లు నిర్లక్ష్యం చేసినా 540 మి.మె.ట. పేరుకుపోతుందని సర్వే హెచ్చరించింది. ప్లాస్టిక్ పునర్వినియోగం చేసే చర్యల వల్ల లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చని, పేదరికం నుంచి కోట్లాది మందిని బయటకు తీసుకురావచ్చని తెలిపింది. ఎల్లెన్ మాక్ ఆర్థర్ ఫౌండేషన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, సిస్టమిక్, ఆక్స్ ఫర్ట్ విశ్వవిద్యాలయ సంస్థలతో కలిసి పరిశోధనను ‘ది ఫ్యూ ఛారిటబుల్ ట్రస్ట్’
నిర్వహించింది.