బర్డ్ ఫ్లూ వ్యాధితో లక్షలాది కోళ్లు చనిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కోడీ తెలంగాణలోకి రాకుండా చర్యలు చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయగా, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే మూడు చెక్ పోస్టులు పెట్టింది. దీంతో అధికారులు AP నుంచి వచ్చే వాహనాల్ని అలాగే వెనక్కు పంపుతున్నారు. APలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు https://justpostnews.com ప్రాంతాల్లో లెక్కలేనంతగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నిత్యం వందల సంఖ్యలో కోళ్ల వాహనాలు AP నుంచి తెలంగాణకు వస్తుంటాయి. AP నుంచి పరీక్షల కోసం శాంపిళ్ల(ముక్కు, రెట్టల)ను సేకరించి ఈనెల 6న మధ్యప్రదేశ్ భోపాల్(Bhopal)లోని డయాగ్నొసిస్ ల్యాబ్ కు పంపించారు.
ఇప్పటికే కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్(Infected)గా చేసి కోళ్లను పూడ్చిపెడుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధికి హెచ్5ఎన్1 అనే వైరస్ కారణం. ఇది అంటువ్యాధి కావడంతో వ్యాప్తి చెందే లక్షణం ఎక్కువ. ఇది రోజుల వ్యవధిలోనే పెంపుడు పక్షులు, కోళ్లకు సోకుతుంది. పక్షుల రెట్టలు, కలుషితమైన ఆహారం, నీటితో ఇది వ్యాప్తి చెందుతుంది. అయితే వైరస్ సోకని కోడి ఉంటే గనుక ఆ మాంసాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినొచ్చని చెబుతున్నారు. సరిగా ఉడకబెట్టకపోతేనే సమస్యలు వస్తాయంటున్నారు.