దేశంలో తొలిరోజు(జనవరి 6)న మూడు హ్యూమన్ మెటాన్యుమో వైరస్(hMPV) కేసులు నమోదు కాగా, ఇవాళ మరో రెండు వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని నాగపూర్(Nagpur)లో వైరస్ ను గుర్తించారు. ఏడేళ్లు, 13 సంవత్సరాలు గల ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరితే వారికి నిర్వహించిన పరీక్షల్లో hMPV పాజిటివ్ వచ్చినట్లు మహారాష్ట్ర హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ శశికాంత్ శంభార్కర్ ప్రకటించారు. కోలుకున్నాక ఆ ఇద్దర్నీ డిశ్చార్జి చేసిన డాక్టర్లు.. పాజిటివ్ శాంపిల్స్ ను తదుపరి పరీక్షల కోసం నాగపూర్లోని ఎయిమ్స్(AIIMS) పంపించారు. నిన్న బెంగళూరులో రెండు, గుజరాత్ అహ్మదాబాద్ లో ఒక కేసు బయటపడ్డాయి.