మంకీపాక్స్(Monkeypox) వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించడం, చుట్టుపక్కల దేశాల్లోనూ కేసులు వెలుగుచూడటంతో కేంద్రం అలర్ట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చే వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులతో నిర్వహించిన సమీక్ష(Review)లో వైద్య మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు.
విమానాశ్రయాలు, ఓడరేవుల(Seaports) వద్ద హెల్త్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వ్యాధిని నిర్ధారించేందుకు అవసరమైన రీతిలో ల్యాబొరేటరీలు అందుబాటులో ఉంచబోతున్నారు. సరైన వసతులుంటే 2 నుంచి 4 వారాల్లో బాధితులు కోలుకునే ఛాన్సెస్ ఉన్నందున ఆ దిశగా దృష్టిపెట్టాలని నడ్డా సూచించారు.