కొందరికి బస్సు, కారు ఎక్కితేనే వాంతులు(vomiting) అవుతుంటాయి. తల తిప్పటం, వికారమూ జరుగుతుంటుంది. దీన్ని మోషన్ సిక్ నెస్ అని అంటారు. దీనికి అసలు కారణం.. కళ్ల నుంచి, చెవి లోపలి నుంచి బ్రెయిన్ కు అందే సమాచారమే. మనం కదులుతున్నామా లేదా అనేది కాళ్లు, చేతుల నుంచి వచ్చే ఇండికేషన్స్ బ్రెయిన్ కు చేరవేస్తాయి. దీనితోపాటు చెవిలోని ఒక ద్రవం మనం కదులుతున్న విషయాన్ని గమనించి మెదడుకు చేరవేస్తుంది. ఒకవేళ మనం జర్నీ చేస్తూ కదలటం లేదని కళ్ల నుంచి సమాచారం అందింతే మెదడు తికమకపడుతుందట. దీనివల్ల వాంతి, వికారం వంటివి కలుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. టెన్షన్, ప్రెజర్ వంటి వాటి వల్ల ఇవి మరింత ఎక్కువవుతాయంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జర్నీ చేసేటప్పుడు వెహికిల్స్ కిటికీ పక్కన కూర్చోవాలి.
దూరప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.
కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినాల్సి ఉంటుంది.
సొంత వాహనమైతే మధ్యమధ్యలో కాసేపు ఆపి రెస్ట్ తీసుకోవాలి.
డాక్టర్ సలహా మేరకు బయల్దేరే గంట ముందు టాబ్లెట్ వేసుకుంటే మంచిది.
అల్లం రుచితో కూడిన రుచికరమైన బిళ్లలు తినాలి.
వీలైతే కళ్లు మూసుకోవాలి, లేదంటే పడుకోవాలి.