
భారత పొరుగు దేశాల్లో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం ముడిచమురుపై పడి గిలగిలా కొట్టుకుంటున్నాయి. శ్రీలంకలో 12.5 కిలోల సిలిండర్ పై రూ.775 పెంచడంతో రూ.4,765కు చేరింది. 5 కిలోల రీఫిల్ పై రూ.308 పెరిగి రూ.1,910కి.. 2.3 కేజీలకు రూ.140 పెరిగి రూ.840కి పెంచుతూ అక్కడి లిట్రో గ్యాస్ సంస్థ నిర్ణయించింది. మనదేశంలో ఉగాది సమయంలోనే శ్రీలంకలో పుత్తాండు కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్పీజీ ధర పెరగడంతో కుటుంబాలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోంది. అయితే ప్రజలపైనే పూర్తి భారం మోపకుండా పరిమిత స్థాయిలోనే ధరలు పెంచినట్లు లిట్రో గ్యాస్ తెలిపింది.