56 ఏళ్ల మౌలానా మసూద్ అజహర్.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు(Founder). ఐరాస లిస్టులో అతడు అంతర్జాతీయ ఉగ్రవాది. 1994లో అతణ్ని పట్టుకున్నా, IC-814 ఎయిరిండియా విమానం హైజాక్ తో విడిచిపెట్టాల్సి వచ్చింది. 2001లో పార్లమెంటుపై, 2016లో పఠాన్ కోట్, 2019లో పుల్వామా దాడుల మాస్టర్ మైండ్. అలాంటి నరరూప రాక్షసుడి కుటుంబం తలదాచుకున్న భవనంపైకి మిస్సైళ్లు దూసుకెళ్లాయి. బహవల్పూర్(Bahawalpur)లోని జామియా మసీద్ సుభానల్లాపై ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. అజహర్ భార్య, అతడి పెద్దక్క, ఆమె భర్త, మేనల్లుడు, మేనకోడలుతోపాటు ఐదుగురు పిల్లలు హతమయ్యారు. ఈ 10 మంది కుటుంబ సభ్యులు సహా అత్యంత సన్నిహితులు నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ వివరాల్ని స్వయంగా మసూదే ప్రకటించాడు.