@ ప్రపంచవ్యాప్తంగా బానిసత్వాన మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా 20 సంపన్న దేశాల్లోనే ఉన్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ తన నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ రూపొందించిన 172 పేజీల నివేదిక బుధవారం విడుదల అయింది. మొత్తం 160 దేశాల్లో బానిసత్వం ఉన్నట్లు అంచనా వేసింది. విస్తృత స్థాయిలో ఇంటింటి సర్వేలు, బాధితులతో ఇంటర్వ్యూలు నిర్వహించి నివేదికను తయారు చేసినట్లు సదరు ఫౌండేషన్ వెల్లడించింది.