విమానాశ్రయం(Airport) నుంచి టేకాఫ్ అవుతుండగా కొద్ది క్షణాల్లోనే విమానం ప్రమాదానికి గురై 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది. పైలట్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.
స్థానిక శౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన చిన్న విమానం ఇద్దరు సిబ్బంది, మరో 17 మంది సాంకేతిక బృందంతో (Technical Team)తో.. మెయింటెనెన్స్ నిమిత్తం పోఖ్రా సిటీకి వెళ్తున్నారు. ప్లేన్ ఒక్కసారిగా రన్ వేపైనే పక్కకు జారిపోవడంతో పెద్దయెత్తున మంటలు వచ్చాయి.