మరో విమాన ప్రమాదం చోటుచేసుకుని అందులోని 20 మంది మృత్యువాత(Killed) పడ్డారు. ఇంకొకరికి తీవ్ర గాయాలైన ఘటన దక్షిణ సూడాన్(Sudan)లో జరిగింది. 21 మందితో రబ్కోనా కౌంటీ నుంచి జుబాకు వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది. రన్ వేకు అర కిలోమీటరు దూరంలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో ఒక్కసారిగా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రయాణికుల్లో 16 మంది సూడాన్, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అక్కడి చమురు క్షేత్రాల్లో విమాన శకలాలు పడిపోయాయి. చుట్టూ చెల్లాచెదురైన విమాన భాగాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పద్నాలుగేళ్ల క్రితమే స్వాతంత్ర్యం పొందిన సౌత్ సూడాన్(South Sudan)లో సరైన పరిపాలనా విధానాలు లేక రవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. దీంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి.