బస్టాప్ లో నిల్చున్న భారతీయ విద్యార్థినిని కెనడా(Canada)లో దుండగులు కాల్చిచంపారు. కారులో నుంచి కాల్పులు జరపడంతో ఆమె ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయింది. కానీ ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. హర్ సిమ్రత్ రణ్ ధావా అనే 21 ఏళ్ల యువతి హామిల్టన్‌లోని మొహాక్(Mohawk) కాలేజీలో చదువుతోంది. ఈ విషయాన్ని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. CC ఫుటేజ్ ఆధారంగా దుండగుల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.