ఇజ్రాయెల్(Israel) జరిపిన భీకర దాడుల్లో 330 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ లక్ష్యంగా గాజా(Gaza)పై మిలిటరీ దాడి జరిగింది. ఈ జనవరి 19న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉండగా, మరో 150 మంది గాయపడ్డారు. గాజా సిటీ, డీర్ అల్-బలాహ్, ఖాన్ యూనిస్, రఫా ప్రాంతాల్లో విమానాలతో సైన్యం విరుచుకుపడింది. హమాస్ నేత మహుమూద్ అబు వఫ్తా హతమైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి. బందీల విడుదలను ప్రతిసారీ తిరస్కరించడం వల్లే ఆపరేషన్ చేపట్టినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.