
ఎర్ర సముద్రం(Red Sea)లో దురాగతాలకు పాల్పడుతున్న హౌతీలపై అమెరికా విరుచుకుపడింది. తీవ్రవాదులే లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో 21 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యెమెన్(Yemen)లోని అతివాద గ్రూప్ హౌతీ.. ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేస్తుంటుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టాక వారి అరాచకాలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ పైనా, సముద్ర మార్గం గుండా వెళ్లే వివిధ దేశాల ఓడల్ని చెరబట్టేవారు. దీనిపై కన్నెర్రజేసిన ట్రంప్.. దాడులకు దిగాలంటూ మిలటరీకి ఆదేశాలిచ్చారు.