అమెరికా(United States) దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి. క్రిస్మస్ సందర్భంగా ఎక్కడికక్కడ వేడుకలు జరుపుతూ వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సిన సమయంలో అతి పెద్ద సమస్య తలెత్తింది. సాంకేతిక ఇబ్బందుల(Technical Issues) వల్ల అమెరికా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి ఎయిర్ లైన్స్ లో సమస్య తలెత్తినట్లు గుర్తించిన అధికారులు.. సరిచేసే పనిలో పడ్డారు.