అమెరికా ‘గ్రీన్ కార్డు’ కోసం పదిన్నర లక్షల మంది ఎదురుచూస్తున్నారట. సిటిజన్ షిప్(Citizenship)గా భావించే ‘గ్రీన్ కార్డు’ దొరకాలంటే కష్టమైన పరిస్థితులున్నాయని ఓ సంస్థ చేసిన రీసెర్చ్ లో బయటపడింది. మొత్తంగా అన్ని దేశాల్ని లెక్కేస్తే 18 లక్షల మంది దీని కోసం ఎదురుచూస్తుండగా అందులో భారతీయులే 10.5 లక్షల మంది ఉన్నారని క్యాటో ఆర్గనైజేషన్ తేల్చింది. వలస వచ్చినవారు పర్మనెంట్ గా USలో ఉండేందుకు అవకాశం కల్పించే ఈ ‘గ్రీన్ కార్డు’కు పరిమితులు ఉండటంతో అంత సులువుగా దక్కే అవకాశం ఉండటం లేదు. అందువల్ల దీని కోసం ఏళ్లకేళ్లుగా వెయిట్ చేయడమే తప్ప చేసేదేమీ లేకుండా పోతున్నది.
ప్రతి సంవత్సరం కేటాయించే ఈ ‘గ్రీన్ కార్డు’ల్లో కేవలం 7 శాతం మందికి మాత్రమే ఇచ్చే వెసులుబాటు(Availability) ఉంది. ఇలాంటి పరిస్థితుల వల్ల కొత్తగా అప్లయ్ చేసుకునేవారికి ఇక ఎన్నేళ్లయినా దొరికే అవకాశం లేకుండా పోతున్నదని ఆ సర్వే సంస్థ తెలిపింది. ఇపుడున్న తీరును చూస్తే 4 లక్షల మంది భారతీయులకు జీవితకాలం పూర్తయినా ‘గ్రీన్ కార్డు’ దొరకదట.