అమెరికా ప్రమాదం అంచుల్లో ఉంది. ప్రస్తుతం 2.7%గా ఉన్న వార్షిక ద్రవ్యోల్బణం రేటు 2026లో 3 నుంచి 4 శాతానికి చేరుకోనుందట. ఈ విషయాన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండి(Zandi) తెలిపారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని తొలిసారి అంచనా వేసింది ఆయనే. చాలా రాష్ట్రాలు మాంద్యంలో ఉన్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం, సుంకాలే దీనికి కారణం. వ్యోమిగ్, మోంటానా, మిన్నెసోటా, మిస్సిసిపి, కాన్సాస్, మసాచుసెట్స్ రాష్ట్రాలు డేంజర్లో ఉన్నట్లు జాండి తెలిపారు. భారత్ తో పెట్టుకుంటే అంతే అన్న మాటలు వినపడుతున్నాయి.