అమెరికా-ఉక్రెయిన్ మధ్య ఏర్పడ్డ విభేదాలతో డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్(Ukraine)కు మిలిటరీ సహాయాన్ని నిలిపివేశారు. అయితే రష్యాతో శాంతి చర్చల కోసమే తాత్కాలికంగా మిలిటరీ సహాయాన్ని నిలిపివేశామంటున్నారు అగ్రరాజ్య అధినేత. ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నందున ఆ దేశంలో ఖనిజాల తవ్వకాలకు అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ కోరారు. ఆయనతో సోమవారం భేటీ అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ట్రంప్ తోపాటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ తోనూ గొడవ పడ్డారు.