విమానం కూలి రష్యాలో 49 మంది మృతిచెందారు. అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన AN-24 ప్లేన్.. అమూర్ రీజియన్లోని టైండా(Tynda) సమీపంలో కూలినట్లు రెస్క్యూ హెలికాప్టర్ గుర్తించింది. సైబీరియా బేస్డ్ ఎయిర్ లైన్ ను అంగారా ఎయిర్ లైన్ గా పిలుస్తారు. ఐదుగురు పిల్లలు సహా 43 మంది ప్రయాణికులు, మరో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)తో సంబంధాలు కోల్పోయిన విమానం కోసం రక్షణ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ల్యాండింగ్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ప్రమాదం జరిగింది. https://justpostnews.com