మూడు ఫార్మాట్లలో 281 మ్యాచ్ లు, 744 వికెట్లు… ఎన్నో(Lot Of) మ్యాచుల్ని ఒంటిచేత్తో గెలిపించిన స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin). ఈ ప్లేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన బౌలింగ్ లాగే ఎప్పుడూ కూల్ గా కనిపించే అశ్విన్ కి విపరీతమైన కోపమొచ్చింది. బ్యాటింగో, బౌలింగ్ లోనో అనుకునేరు. అది ఒక ట్వీట్ గురించి. ఇంకేముంది డైరెక్ట్ గా ‘X(మాజీ ట్విటర్)’ యజమాని(Owner) ఎలాన్ మస్క్ కే ట్యాగ్ చేశాడు. దీనికి కేవలం 2 గంటల్లోనే 13 వేల లైక్స్ వచ్చాయి. ఆ ట్యాగ్ ఏంటంటే…
మొదలైందిలా…
నిన్నటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ సంచలన గెలుపు తర్వాత వజాహత్ కజ్మీ అనే పాకిస్థాన్ జర్నలిస్ట్.. ‘X’లోని అశ్విన్ టైమ్ లైన్లో ఒక ట్వీట్ పెట్టాడు. ‘అఫ్గాన్ ప్రపంచంలో అన్ని దేశాలను ఓడిస్తుంది ఒక్క భారత్ ని తప్ప.. ఇందుకు సహేతుక(Obvious) కారణాలున్నాయి.. ఐపీఎల్ కాంట్రాక్టులు ఎంతో కీలకం కదా..’ అన్నది ఆ ట్వీట్ సారాంశం.
అశ్విన్ ఫైర్…
‘యూజర్ ఇష్టమొచ్చినట్లు ట్వీట్ పెడితే.. ‘X’కు బ్లాక్ బటన్ ఉంటుంది. దాన్ని ‘X(మాజీ ట్విటర్)’ యూజ్ చేయొచ్చు.. ఇలాంటి ట్వీట్లను రోజూ బ్లాక్ చేసే డ్యూటీ నాది కాదు.. దేన్ని ఫాలో కావాలో నాకు తెలుసు.. మీకో విషయం చెప్పదలచుకున్నా.. మా ఇంట్లో ఎవర్ని అడుగుపెట్టనివ్వాలో నాకు తెలుసు.. నా టైమ్ లైన్ అయినా నా డిసిషన్ అయినా హక్కు నాదే..’ అంటూ అశ్విన్ డైరెక్ట్ గా ఎలాన్ మస్క్ కే ట్యాగ్ చేశాడు.