బహుళ అంతస్తుల భవనంలో మంటలు అంటుకుని 41 మంది సజీవ దహనమైన ఘటన కువైట్ లో చోటుచేసుకుంది. దక్షిణ కువైట్(Southern Kuwait)లోని మంగాఫ్(Mangaf)లో ప్రమాదం జరిగి అందులో ఉంటున్న భవన నిర్మాణ కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఘటన జరిగిన సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు అందులో చిక్కుకుపోయారు.
అగ్నిప్రమాదంలో మరో 43 మంది గాయపడ్డట్లు కువైట్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాయబారి(Ambassador) ఘటనాస్థలికి వెళ్లి పరిశీలిస్తున్నారని, ప్రమాదంలో ఎంతమంది భారతీయులు చిక్కుకున్నారనే వివరాలు తర్వాత తెలియజేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన జైశంకర్.. బాధితుల్ని ఆదుకుంటామన్నారు.