ఇజ్రాయెల్ భీకర దాడి(Attack)కి పాల్పడటంతో 71 మంది మృత్యువాత పడ్డారు. గాజా(Gaza)లోని ఖాన్ యూనిస్ లో జరిగిన ఈ ఘటనలో 250 మందికి పైగా గాయపడ్డారు. ఇది అత్యంత దారుణ వధ అంటూ గాజాలోని హమాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం అని విమర్శించింది.
35 వేలకు పైగా…
ఇజ్రాయెల్ దళాలు కురిపించిన బాంబులు ఖాన్ యూనిస్ లో టెంట్లలో తలదాచుకుంటున్న ప్రజలపై పడ్డాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడికి తెగబడ్డ అక్టోబరు 7 తర్వాత ఇప్పటిదాకా ఈ యుద్ధంలో 38,345 మంది ప్రాణాలు కోల్పోతే, 88,295 మంది క్షతగాత్రులైనట్లు(Wounded) గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.