
ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పుల్లో 15 మంది మృతికి పాకిస్థానీలే కారణమని తేలింది. దుండగులైన తండ్రి సాజిద్ అక్రమ్(50)ను అక్కడికక్కడే పోలీసులు కాల్చి చంపగా, తనయుడు నవీద్(24) గాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో గన్స్ పై కఠిన చట్టాలు వచ్చిన 30 ఏళ్ల తర్వాత అతిపెద్ద ఘటన ఇది. 1998లో స్టూడెంట్ వీసాపై వచ్చిన సాజిద్ ఫ్రూట్స్ దుకాణం పెట్టుకుని అక్కడే స్థిరపడ్డాడు. యూదుల పండుగ ‘హనుక్కా’ వేడుకలు జరుపుకుంటుండగా కాల్పులు జరిగాయి. దీనికి కొన్ని గంటల ముందే తల్లి వెరేనాకు నవీద్ ఫోన్ చేశాడు. నేను స్విమ్ కు వెళ్లా.. స్కూబా డైవింగ్ చేశా.. చాలా హాట్ గా ఉంది.. మేం ఇక్కడే ఉంటున్నాం.. అని చెప్పినట్లు తల్లి పోలీసులతో చెప్పింది. రెండు నెలల క్రితమే అతడి ఉద్యోగం పోయింది.