ఇరాన్(Iran) న్యూక్లియర్ ప్లాంట్లపై అమెరికా B-2 స్టెల్త్ బాంబర్స్ విరుచుకుపడ్డాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్.
ఘనతలేంటంటే…
@ వీటిని నార్త్రాప్ గ్రమ్మన్(Northrop Grumman) కంపెనీ తయారు చేసింది. https://justpostnews.com
@ 1989లో తయారీ మొదలైతే 1997 జనవరి 1న అమెరికా చేతికి వచ్చింది. 2024 నాటికి US చేతిలో 19 బాంబర్లున్నాయి.
@ స్టెల్త్ టెక్నాలజీతో దట్టమైన నిరోధక వ్యవస్థల్ని తట్టుకోగా, రీ-ఫ్యూయలింగ్ లేకుండానే 6 వేల నాటికల్ మైల్స్ కంటిన్యూగా వెళ్తుంది.
@ ఇద్దరు పైలట్లతో 230 కిలోల గైడెడ్ లేదా 1,110 కేజీల B-83 అణుబాంబులు, థర్మోన్యూక్లియర్ ఆయుధాల్ని విడుస్తుంది.
@ ఒక్కో విమానానికి 2.1 బి.డాలర్ల(రూ.17 వేల కోట్ల)తో మొదలైతే 2024 నాటికి ఖర్చు 4.17 బి.డా.(రూ.35 వేల కోట్ల)కు చేరింది.
@ 15 వేల మీటర్ల ఎత్తు నుంచి దాడి చేస్తుంది.. గాలిలోనే ఇంధనం నింపినట్లయితే 19 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
@ రష్యాను ఉద్దేశించి తయరైన ఈ బాంబర్లను 1999లో కొసావోలో ఆ తర్వాత ఇరాక్, అఫ్గానిస్థాన్, లిబియా, యెమన్ లో వాడారు.