2025లో కొవిడ్ లాంటి విపత్తు, ఆర్థిక సంక్షోభం(Crisis)తో తప్పవని ఆధ్యాత్మికవేత్త బాబా వంగా అంచనా వేశారు. 9/11 దాడులు, డయానా మరణం, కొవిడ్-19 వంటి వాటిని ఆమె ముందే చెప్పింది. ఈ ఏడు వినాశకర ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని.. ట్రంప్ సుంకాలు వాణిజ్యాన్ని దెబ్బతీయడం ‘మానవత్వ పతనానికి నాంది’ అని హెచ్చరించారు. బాబా వంగా అని పిలిచే రచయిత రియో టాట్సుకి.. 1999లో ‘ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్’ అనే కామిక్ ను సృష్టించారు. ‘2020లో తెలియని వైరస్ కనిపిస్తుంది.. ఏప్రిల్ లో గరిష్ఠ స్థాయికి చేరుతుంది..’ అన్న జోస్యాన్ని జపాన్ టుడే ప్రచురించింది. కొవిడ్-19 2030లో పుంజుకుంటుందని, ఇప్పుడు అదృశ్యమైనా పదేళ్ల తర్వాత మళ్లీ కనిపిస్తుందంటూ జోస్యం చెప్పింది. ప్రిన్సెస్ డయానా, సంగీతకారుడు ఫ్రెడ్డీ మెర్క్యురీ చనిపోతారని ముందే అంచనా వేసిందామె.
ఆ అంచనాలు 15 సంవత్సరాల కాలచక్రానికి లోబడి ఉంటాయి. 2030లో ఏమీ జరగకపోతే దానర్థం.. మరో 15 ఏళ్లు అంటే 2045 వరకు ప్రమాదం ఉంటుందన్నది జోస్యం. 30 సంవత్సరాల క్రితం బాబా వంగా మరణించినా.. ప్రపంచ సంఘటనల్ని అంచనా వేయగల అసాధారణ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు. ఈమె అంధ(Blind) బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త కాగా.. బాల్కన్ నోస్ట్రాడమస్ గా పిలుచుకుంటారు. గత నెల(మార్చి)లో మయన్మార్, థాయిలాండ్ భూకంపాల్లో 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నెలలు నిండకముందు బల్గేరియాలో అంధురాలిగా పుట్టిన బాబా వంగా అసలు పేరు వంగేలియా పండేవా గుష్టెరొవా.
1 thought on “2025లో పెను విపత్తు తప్పదా… ఆమె జోస్యం… Prediction On Disaster”