ఇస్కాన్(ISKCON) ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ కు బంగ్లాదేశ్(Bangladesh)లో ఎట్టకేలకు బెయిల్ దొరికింది. రాజద్రోహం కేసులో అరెస్టయి జైలులో ఉన్నారాయన. తొలుత ఈయనకు అనుకూలంగా వాదించేందుకు ఒక్క లాయరు ముందుకు రాలేదు. కృష్ణదాస్ కేసు వాదించేందుకు ముందుకొచ్చిన న్యాయవాదిపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. రవీంద్ర ఘోష్ అనే మరో లాయర్ 250 కిలోమీటర్లు ప్రయాణించి ఢాకా వస్తే అతణ్ని వాదించేందుకు అనుమతివ్వలేదు. 2024 నవంబరులో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో ఇస్కాన్ పై నిషేధం విధించాలన్న పిటిషన్ ను బంగ్లా హైకోర్టు కొట్టివేయగా, చిన్మయ్ ని అరెస్టు చేశారు.