భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఎంత దృఢంగా(Strong) ఉంటాయో అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ నుంచి బంగ్లా ఏర్పడ్డప్పటినుంచి ఆ దేశం పట్ల భారత్ కనబరుస్తున్న ఆత్మీయత దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఐదు పర్యాయాలు(Five Times)గా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన షేక్ హసీనా వాజిద్ అయితే భారతదేశాన్ని పెద్దన్నగా చూస్తారు. ఈ మధ్యనే ఆమె ఐదోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఇరుదేశాల సంబంధాల(Relations)ను మరింత బలోపేతం చేస్తున్నారు.
బాయ్ కాట్ ఇండియా పిలుపుతో…
బంగ్లాదేశ్(Bangladesh)లో షేక్ హసీనా సర్కారు తిరిగి ఎన్నికైనప్పట్నుంచి ‘బాయ్ కాట్ ఇండియా’ ఉద్యమం మొదలైంది. విపక్షమైన బంగ్లా నేషనలిస్ట్ పార్టీ(BNP)… భారత్ పట్ల వ్యతిరేక వైఖరి చూపిస్తున్నది. తమ దేశ రాజకీయాల్లో పొరుగు దేశం జోక్యం చేసుకుంటుందన్నది BNP ఆరోపణ. దీనిపై ప్రధాని హసీనా తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘భారత్ వస్తువుల్ని(Indian Made) బాయ్ కాట్ చేయాలని BNP నేతలు అంటున్నారు.. అలా చేయాల్సి వస్తే ముందుగా మీ భార్యలు కట్టుకునే చీరల్ని బహిష్కరించండి.. ఎంతమంది తమ సతీమణుల చీరల్ని తగులబెడతారో చెప్పండి..’ అంటూ అక్కడి ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఫుడ్ కూడా…
‘కేవలం చీరలే కాదు.. భారత్ ను విమర్శించే వాళ్లంతా అక్కడి నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాల్ని(Spices) కూడా వాడకూడదు..’ అంటూ అవామీ లీగ్ చీఫ్ అయిన హసీనా విపక్షానికి వార్నింగ్ ఇచ్చారు. ఈ జనవరిలో షేక్ హసీనా ప్రధానిగా ఎన్నికై.. సుదీర్ఘకాలం ఆ పదవిలో ఉన్న నేతగా రికార్డులకెక్కారు. 299 స్థానాలు గల పార్లమెంటులో ఆమె పార్టీకి 216 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో భారత్ మితిమీరిన జోక్యం చేసుకోవడం వల్లే ఆమె గెలిచారని BNP ఆరోపించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిన శ్రీలంకను ఆదుకోవడంలో భారత్ విఫలమైందని, బంగ్లాకు కూడా అదే పరిస్థితి వస్తుందంటూ అక్కడ వీడియోలు రిలీజ్ చేశారు. దీనిపై హసీనా తీవ్రస్థాయిలో మండిపడి భారత్ పై ఉన్న ప్రేమను మరోసారి గుర్తు చేస్తూ విపక్షానికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.