
బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన యువ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ(Haadi) మరణం ఆ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. భారత వ్యతిరేక గళం వినిపించే హాదీపై ఇటీవలే కాల్పులు జరగ్గా, సింగపూర్లో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. దీంతో నిరసనకారులు ఢాకా, చిట్టగాంగ్ ల్లో హింసకు దిగారు. ప్రధాన మీడియా కార్యాలయాలకు నిప్పు పెట్టి భారత ఎంబసీల్ని ముట్టడించారు. ఎన్నికల వేళ జరిగిన ఈ హత్య వెనుక అనుమానాలుండగా, ఆ దేశం అగ్ని రాజుకుంటూనే ఉంది. ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దించిన తర్వాత నుంచి బంగ్లా పరిస్థితులు ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి చేరాయి.