
రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం(Earthquake)తో బంగ్లాదేశ్ లో ఆరుగురు చనిపోయారు. వందల మంది గాయపడ్డట్లు అక్కడి సర్కారు తెలిపింది. ఈ ప్రభావం తూర్పు భారత్ పై పడింది.
కోల్ కతాతో పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉన్నట్టుండి బిల్డింగ్ లు ఊగి ఒరిగిపోవడం, కొన్నిచోట్ల వంతెనలు కూలిపోవడంతో ప్రజలు పరుగులు తీశారు. ఇండియా-యురేషియా టెక్టానిక్ ప్లేట్ల కదలికతో తరచూ ఈ జోన్లో భూకంపాలు వస్తుంటాయి. ఢాకాకు 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(USGS) ప్రకటించింది. నిన్న పాకిస్థాన్ లోనూ 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది.