భారతదేశంలోని బంగ్లాదేశీయుల్ని కేంద్రం గుర్తించింది. వారిని(Immigrants) సాగనంపేందుకు ధ్రువీకరణను వేగవంతం చేయాలని ఆ దేశానికి సూచించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,360 మంది కంటే ఎక్కువున్నారని తేలగా, వారి ధ్రువీకరణ ప్రక్రియ 2020 నుంచి పెండింగ్ లో ఉంది. ప్రయాణ పత్రాలు లేకుండా రహస్యంగా ప్రవేశించడంతో నిర్దిష్ట సంఖ్యపై సర్కారు అంచనాకు రాలేకపోయింది. పొరుగు దేశంలో వస్త్ర(Textile) పరిశ్రమ కుప్పకూలడంతో కొన్ని నెలలుగా బంగ్లాల చొరబాటు పెరిగింది. ఈమధ్య కాలంలో 1,000 మందిని అరెస్టు చేసి వెనక్కు పంపినట్లు అసోం CM హిమంత బిశ్వశర్మ తెలిపారు. మే 7-9 తేదీల్లో 300 మంది రోహింగ్యాలను వెనక్కు పంపించారు.