ట్రంప్ ‘బిగ్ బ్యూటీఫుల్ బిల్లు’.. విదేశీయుల నెత్తిన పిడుగు పడేలా చేసింది. NRIలు పంపే ప్రతి పైసాకు ఇక లెక్కలు చూపించాల్సిందే. అక్కడ 45 లక్షల మంది భారతీయులుంటే, అందులో చాలా మందిది పెద్ద సంపాదనే. ఇప్పటిదాకా NRIలు పంపే డబ్బుపై 5% పన్ను ఉండగా, ప్రస్తుత బిల్లులో ఒక శాతంగా చూపించారు. పన్ను తగ్గిందని సంతోషపడేలోపే.. పంపే ప్రతి పైసాకు లెక్క చూపాల్సిందేనని 900 పేజీల బిల్లులో సర్కారు స్పష్టం చేసింది. ఎక్కువ డబ్బు పంపేవారిపై నిఘా మరింత పెరుగుతుంది. చట్టబద్ధంగా నివసించే వారి ఖర్చుల్ని కూడా ఈ బిల్లు పెంచుతుంది. పత్రాలు లేకుండా USలో ఉంటున్న భారతీయులు 18 వేల మంది. వీరందర్నీ బహిష్కరిస్తామన్న ట్రంప్.. అందుకు ఈ బిల్లు ఉపయోగపడనుంది. https://justpostnews.com