ప్రపంచవ్యాప్తంగా గత 7 దశాబ్దాల్లో(Decades) తొమ్మిది భూకంపాలు వచ్చినట్లు జియాలాజికల్ సర్వే నిపుణులు చెబుతున్నారు. 1954 నుంచి 2025 వరకు 71 ఏళ్లల్లో భారీ భూకంపాలు నమోదయ్యాయి. 7.7 తీవ్రతతో వచ్చిన మయన్మార్ భూకంపాన్ని అతిపెద్ద విపత్తుగా భావిస్తున్నారు.
అతి భారీ భూకంపాలివే…
@ 1960 మే 22…: చిలీలోని వాల్దివియాలో 9.6 నుంచి 9.4 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. తద్వారా సునామీ వచ్చి చిలీ, జపాన్, ఫిలీప్పీన్స్ వణికిపోయాయి.
@ 1964 మార్చి 27…: అమెరికాలోని అలస్కాలో 9.3 నుంచి 9.2గా నమోదైంది.
@ 2004 డిసెంబరు 26…: హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ తుపాను ఇండొనేషియా సుమత్రాలో 9.3 నుంచి 9.2గా నమోదైంది. సునామీతో 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
@ 2011 మార్చి 11…: పసిఫిక్ మహాసముద్రం సమీపంలోని జపాన్ తొహుకులో 9.1 నుంచి 9.0 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.