బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్(BLF) దాడులతో పాకిస్థాన్ అల్లకల్లోలమైంది. ‘ఆపరేషన్ బామ్(డాన్)’ పేరిట 17 చోట్ల దాడులు చేసింది. దేశ చరిత్రలో లేని విధంగా పంజ్ గర్, సూరబ్(Surab), కెచ్, ఖరన్ లోని మిలటరీ, ప్రభుత్వ వ్యవస్థల్ని ధ్వంసం చేసింది. సైనికులు, మిలిటరీ కమ్యూనికేషన్లు లక్ష్యమని BLF ప్రతినిధి మేజర్ గ్వాహ్రమ్ బలోచ్ అన్నారు. స్వయం ప్రతిపత్తి కోసం జరుపుతున్న దాడులతో పలు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఎంతమంది చనిపోయారన్నది తెలియాల్సి ఉంది. ఇన్నేళ్లూ భారత్ పై ఉగ్రవాదుల్ని ఉసిగొల్పిన దాయాది దేశం.. ఇప్పుడు సొంత మనుషులతోనే దేశాన్ని నాశనం చేసుకుంటోంది.