
అట్లాంటిక్ మహా సముద్రంలో మూడు పడవలు గల్లంతయ్యాయి. ఆ బోట్లలో 300 మంది ప్రయాణిస్తుండగా అందులో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఆఫ్రికాలోని సెనెగల్(Senegal) నుంచి 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పెయిన్ కు చెందిన కానరీ దీవులకు(canary islands) పడవలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇందులో ఉన్నవారంతా మైగ్రెంట్స్(Migrants) అని వలసదారుల హక్కుల సంస్థ వెల్లడించింది. ఒక పడవలో 200 మంది, మరో బోటులో 100 మంది వెళ్తున్నారు.
15 రోజుల క్రితం సదరు బోట్లు కానరీ దీవులకు బయల్దేరగా.. మధ్యలోనే అవి కనపడకుండా పోయాయి. దీంతో స్పెయిన్ అధికారుల బృందాలు గాలింపు చేపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో అక్రమంగా వలసదారులను తీసుకెళ్తున్న పడవ మునిగి 80 మంది చనిపోగా.. 500 మంది గల్లంతయ్యారు.