పాకిస్థాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మంది దాకా గాయపడగా అందులో చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఖైబర్ పంక్తుఖ్వా ప్రావిన్స్ లోని బజౌర్ లో జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజి JUI-F పార్టీ మీటింగ్ లో ఈ బ్లాస్ట్ జరిగింది. సంస్థకు చెందిన కీలక నేత అక్కడకు చేరుకుని ప్రసంగించాల్సి ఉంది. ఇంతలోనే ఈ పేలుడు సంభవించి భారీయెత్తున ప్రాణనష్టం జరిగింది. ఈ దాడికి సంబంధించి ఏ సంస్థా ఇంతవరకు ప్రకటన చేయలేదు. అయితే అఫ్గానిస్థాన్ బోర్డర్ లో జరిగిన ఈ ఘాతుకానికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ గ్రూపేనని అనుమానిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే వందలాదిగా సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని బాధితుల్ని హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. ఘటనాస్థలిలో పరిస్థితి భయానకంగా ఉందని ఖైబర్ పంక్తుఖ్వా పోలీసులు అంటున్నారు.