
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు చెరువులో పడిన ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 35 మందికి తీవ్రంగా గాయలయ్యాయి. ఛత్రకాండ ఏరియాలో వాహనం చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు వేగంగా నీళ్లల్లోకి దూసుకుపోవడంతో మహిళలు, చిన్నారులు అందులో చిక్కుకుపోయారు.
ఘటన తెలిసిన వెంటనే స్థానికులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీళ్లలో పడ్డ బస్సు నుంచి పలువురు సురక్షితంగా బయటపడ్డారు.