కనిపించకుండా పోయిన విదేశాంగ మంత్రి స్థానంలో కొత్త మంత్రికి చైనా బాధ్యతలు కట్టబెట్టింది. ఈ మేరకు చైనా(China) ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న క్విన్ గాంగ్.. ఈ జూన్ నుంచి అదృశ్యమయ్యాడు. ఆయన ఆచూకీ, వివరాల వంటివి తెలియకపోవడంతో ఆయన్న విదేశాంగ శాఖ నుంచి రీమూవ్ చేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. మూణ్నాలుగు వారాలుగా ఇది చైనాతోపాటు ఇంటర్నేషనల్(International) లెవెల్లో సంచలనం రేపింది. మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్ పింగ్ కు ఇది పెద్ద తలనొప్పిలా తయారైంది. ఇక లాభం లేదనుకున్న ప్రెసిడెంట్.. తనకు అత్యంత సన్నిహితుణ్ని ఆ ప్లేస్ లో కూర్చోబెట్టారు.
కొత్త ఫారిన్ మినిస్టర్ గా వాంగ్ యీ(Wang Yi)ని రిక్రూట్ చేశారు. క్విన్ గాంగ్ అదృశ్యమైనప్పటి నుంచి అన్ అఫీషియల్ గా వాంగ్ యీనే విదేశాంగ బాధ్యతలు చూస్తున్నారు. సౌతాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుతోపాటు US సెక్రటరీలతో సంప్రదింపుల వ్యవహారాల్ని నడిపారు. క్విన్ గాంగ్ పై నిర్ణయం తీసుకునేందుకు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా సమావేశమైంది. క్విన్ గాంగ్ అనారోగ్య కారణాలతో కనిపించకుండా పోయారేమో అంటూ అంతర్జాతీయంగా వెల్లువెత్తుతున్న అనుమానాలు, ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేస్తూ చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రకటన చేసింది.