అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం(Trade War).. డ్రాగన్ దేశాన్ని దిగొచ్చేలా చేసింది. చేసేదిలేక ఆ దేశం.. భారత్ సహకారాన్ని కోరింది. చైనా దిగుమతులపై 20 శాతం సుంకాలను(Tariffs) ట్రంప్ విధించడంతో.. జిన్ పింగ్ సర్కారు సైతం అదేరీతిన బదులిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తమతో కలిసి రావాలని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. ‘ఎలిఫెంట్-డ్రాగన్ డ్యాన్ చేసే అవకాశం వచ్చింది.. ఇందుకు ఇదే మంచి తరుణం.. రెండు దేశాలు మరింత బలంగా సహకారాన్ని పెంచుకోవాల్సి ఉంది.. ఆసియాలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒక్కటైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది.. తద్వారా ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ సంబంధాలు బలపడతాయి..’ అని కోరారు. కానీ దీనిపై మోదీ సర్కారు ఇప్పటికీ స్పందించలేదు.