
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై చైనా కఠినమైన నిబంధనలు తయారు చేసింది. ఇక నుంచి ఆ గైడ్ లైన్స్(Guidelines) ప్రకారమే AIని వాడాలని ఆదేశించింది. ఈ గైడ్ లైన్స్ ఈ నెల 15 నుంచి మొదలవుతాయని ప్రకటించింది. అయితే దాని కంటే ముందే.. దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ ‘ఆపిల్’.. అనేక చైనా యాప్ లు రీమూవ్ చేసింది. వందల కొద్దీ చాట్GPT లాంటి యాప్ లను తొలగించింది. చైనా మొబైల్ యాప్ అనలిటిక్స్ ప్లాట్ ఫారం ఖిమెయ్(Qimai) డేటా ప్రకారం చైనాలోని యాప్ స్టోర్ నుంచి పెద్దసంఖ్యలో హై-ప్రొఫైల్ యాప్ లను ‘ఆపిల్’ తొలగించింది. ఈ యాప్ ల్లో అత్యంత జనాదరణ కలిగినవి కూడా ఉన్నాయని వివరించింది. స్పార్క్, ChatGAiప్లస్ ఉన్నాయని ప్రకటించింది. అయితే ‘ఆపిల్’ ఈ పని చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2020లో భారీ స్థాయిలో చైనా గేమ్స్(Games)ని ఆ సంస్థ రీమూవ్ చేసింది.
అత్యధిక గేమ్ లు చైనా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వాటిని తొలగిస్తున్నట్లు ‘ఆపిల్’ ప్రకటించింది. AI టెక్నాలజీపై చైనా ప్రభుత్వం న్యూ గైడ్ లైన్స్ ను కఠినతరంగా తయారు చేసింది. AI ద్వారా తయారైన కంటెంట్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని కంపెనీలకు కోరింది. కంటెంట్ హెల్దీగా ఉండటంతోపాటు సోషలిస్ట్ విలువలకు కట్టుబడి ఉండాలని చైనా ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఫేక్ లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ ఉంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అనఫిషియల్ గా అన్ని కంపెనీలు, సంస్థలకు హెచ్చరికలు పంపింది. తప్పుడు సమాచారం తయారు చేయడం, దాన్ని స్ప్రెడ్ చేయడం వంటివి జరగరాదని, ఫేక్ ఇన్ఫర్మేషన్ తయారు చేసే టెక్నాలజీ AIలకు ఉందని ఆదేశాల్లో తెలియజేసింది. ఈ రాబోయే ప్రమాదాల నుంచి తమ పౌరుల్ని కాపాడేందుకు ఇలాంటి రూల్స్ అమలు చేస్తున్నామని బీజింగ్ వర్గాలు అంటున్నాయి.