
చైనాలో వరదలు సృష్టిస్తున్న బీభత్సంలో మూడు కోట్ల మంది ప్రజలు అల్లాడుతున్నారు. కొన్ని ప్రావిన్స్ ల్లో డేంజరస్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల్ని సేఫ్ ప్లేసెస్ కు తరలిస్తున్నారు. వరదలకు తోడు కొండచరియలు విరిగి పడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షల సంఖ్యలో ప్రజల్ని అక్కణ్నుంచి పంపించివేస్తున్నారు. సిచువాన్, చొంగ్ క్వింగ్ ప్రావిన్స్ ల్లో ఫ్లడ్స్ భీకరంగా విరుచుకుపడుతున్నాయి.
కొండ ప్రాంతాల్లో కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగుతూ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. నలుగురు గల్లంతైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. రోడ్లపై కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ ఆపరేషన్స్ కు ఆటంకాలు కలుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజల్ని ఆయా ప్రావిన్స్ ల నుంచి తరలిస్తున్నారు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో చైనా వరదల తాకిడికి గురవుతోంది. 1998లో వచ్చిన వరదలతో 4.000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తర్వాత 2021లో హెనాన్ ప్రావిన్స్ లో వచ్చిన వరదలతో 300 మంది మృత్యువాత పడ్డారు.