ఎటుచూసినా భీకర దృశ్యాలు, ఆర్తనాదాలు. అఫ్గానిస్థాన్ భూకంపంలో 1,411 మంది ప్రాణాలు కోల్పోతే 3,124 మంది గాయపడ్డారు. ఆదివారం అర్థరాత్రి 6 తీవ్రతతో రాగా.. 5 వేల ఇళ్లు కూలాయని తాలిబన్ ప్రభుత్వం(Taliban) ప్రకటించింది. కునార్ ప్రావిన్సులో నష్టం భారీగా ఉంది. 3 రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మూడో అతిపెద్ద విపత్తు ఇది. ఆర్థిక వ్యవస్థ లేక, తినడానికి తిండి దొరకట్లేదు. ఇరాన్, పాక్ గెంటివేతతో లక్షల్లో అఫ్గన్లు స్వదేశానికి రావడంతో అస్తవ్యస్థం ఏర్పడింది.