భారత్-పాక్ అనూహ్య కాల్పుల విరమణ తర్వాత సోషల్ మీడియాలో పుకార్లు(Rumors) షికార్లు చేశాయి. అక్కడి కిరాణా హిల్స్ లోని అణుకేంద్రంపై భారత్ దాడి చేసిందన్నది వార్త. అసలు నిజంగానే దాడి జరిగిందా అని మీడియా అడిగి ప్రశ్నకు.. ఎయిర్ మార్షల్ ఎ.కె.భార్తి క్లారిటీ ఇచ్చారు. ‘మేం అణుకేంద్రంపై దాడి చేయలేదు.. కిరాణా హిల్స్ లోని భవనాలు న్యూక్లియర్(Nuclear)తో నిండి ఉన్నాయని చెప్పినందుకు థాంక్స్..’ అని నవ్వుతూ అన్నారు. భారత్ దాడుల తర్వాత పాకిస్థాన్ లో భూకంపం వచ్చింది. సర్గోధా ఎయిర్ బేస్ సమీపంలోని కిరాణాహిల్స్ అణుకేంద్రంపై దాడి వల్లే భూమి కంపించిందని ప్రచారం జరిగింది. దాడిని అమెరికా, ఈజిప్ట్ మిలిటరీ ఫ్లైట్ రాడార్ ద్వారా గుర్తించారన్నది ప్రధాన వార్త.